Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

ACB : గరిడేపల్లి లోని సుందరి కిరణ్ నివాసంతో పాటు పలుచోట్ల ఏసీబీ సోదాలు..!

గరిడేపల్లి మండలం పరిధిలోనే పొనుగోడు గ్రామంలో గతంలో సూర్యాపేట జిల్లా లో డిఆర్డిఏ పీడీగా పనిచేసిన సుందరి కిరణ్ కుమార్ ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏడిఏ గా పనిచేస్తున్నారు. అయితే ఆయన స్వస్థలమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని పొనుగోడు గ్రామంలో ఏసీబీ అధికారులు ఉదయం దాడులు నిర్వహించారు. సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు మహబూబ్నగర్ ఏసీబీ డిఎస్పి బాలకృష్ణ తెలిపారు.

ACB : గరిడేపల్లి లోని సుందరి కిరణ్ నివాసంతో పాటు పలుచోట్ల ఏసీబీ సోదాలు..!

గరిడేపల్లి, మనసాక్షి :

గరిడేపల్లి మండలం పరిధిలోనే పొనుగోడు గ్రామంలో గతంలో సూర్యాపేట జిల్లా లో డిఆర్డిఏ పీడీగా పనిచేసిన సుందరి కిరణ్ కుమార్ ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏడిఏ గా పనిచేస్తున్నారు. అయితే ఆయన స్వస్థలమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని పొనుగోడు గ్రామంలో ఏసీబీ అధికారులు ఉదయం దాడులు నిర్వహించారు. సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు మహబూబ్నగర్ ఏసీబీ డిఎస్పి బాలకృష్ణ తెలిపారు.

కిరణ్ కుమార్ ఇంటితోపాటు ఆయన బంధువు నీళ్లలో శోధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఏడు చోట్ల దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఆయన బాగస్వామి ఉన్న నేడుచర్ల మండలంలోని చిల్లపల్లి గ్రామ శివారులో ఆవని రైస్ మిల్లులో కూడా అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

కల్వకుర్తి లతో పాటు ఆయన పనిచేస్తున్న ఆఫీస్, గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామంలోనే ఆయన అత్తగారిల్లు ఆయన కూతురు ఉరైనా అనంతగిరి మండలంలోని అమీనాబాద్ అలాగే సూర్యాపేటలో ఆయన నివాసం ఉంటున్న కిరాయి ఇంట్లో రంగారెడ్డి జిల్లా తుక్కలగూడలోనే కిరాయి ఇంట్లో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాడులు నిర్వహిస్తున్న సమయంలో కిరణ్ కుమార్ పొనుగోడులోనే ఉన్నారు. ఏసీబీ అధికారులు ఏడీఏ కిరణ్ కుమార్ ను దర్యాప్తు కొరకు వారి వెంట తీసుకువెళ్లారు. దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తున్నట్టు తెలుస్తుంది.

MOST READ: 

మరిన్ని వార్తలు