Alumni 43 ఏళ్ల తర్వాత తీపి జ్ఞాపకాలతో ఆత్మీయ సమ్మేళనం..!
కేతేపల్లి మండల కేంద్రంలోని సెంట్ ఎలిజిబెత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు.

Alumni 43 ఏళ్ల తర్వాత తీపి జ్ఞాపకాలతో ఆత్మీయ సమ్మేళనం..!
కేతేపల్లి, మనసాక్షి :
కేతేపల్లి మండల కేంద్రంలోని సెంట్ ఎలిజిబెత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. సెంటర్ ఉన్నత పాఠశాలలో 1975 – 82 సంవత్సరాలలో ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు చదువుకున్న విద్యార్థిని విద్యార్థులంతా వారు చదువుకున్న పాఠశాలలోనే ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు.
43 సంవత్సరాల క్రితం ఈ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఆ పాఠశాలకు కంప్యూటర్, ప్రింటర్, గ్రీన్ బోర్డులను లక్ష రూపాయల నిధులతో అందించారు. ఇక్కడ చదువుకొని, ఎక్కడెక్కడో నివాస ఉంటున్న వారంతా కలిసి చిన్నప్పుడు తాము చదువుకున్నప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
గతంలో తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయనీలు ఆగ్నెస్, ఎఫ్జినియా, లక్ష్మి లను సత్కరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గుండా శ్రీనివాస్, చిరంజీవి, శాంతయ్య, రమణ, ఫాతిమా, మంగతాయారు, రఘునాథరెడ్డి, విజయరాణి, అన్నమేరీ, విజయరావు, కొలను శ్రీనివాస్, పి వెంకటరమణ, టి నిర్మల విజయరావు, తదితరులు పాల్గొన్నారు.









