TOP STORIESBreaking Newsతెలంగాణరాజకీయం

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం.. భారత్ గురించి ఆహ్వానం అందుకున్న ఏకైక సీఎం..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత గాంచిన హార్వర్డ్ కెన్నడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం లభించడం అరుదైన రికార్డుగా నమోదయింది.

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం.. భారత్ గురించి ఆహ్వానం అందుకున్న ఏకైక సీఎం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత గాంచిన హార్వర్డ్ కెన్నడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం లభించడం అరుదైన రికార్డుగా నమోదయింది.

భారత్ నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి గా రికార్డు సృష్టించారు. 2026 మార్చి 27 అమెరికాలోని హార్వార్డ్ యూనివర్సిటీలో జరగబోయే ఈ సదస్సుకు ఆయనకు ఆహ్వానం లభించింది. ఏఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్ పవర్, ఇంపాక్ట్ ఆన్ లైబిలిటీ వర్క్ ఫోర్స్ అనే అంశంపై రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఏఐ టెక్నాలజీ, పాలసీ ఆవిష్కరణలలో తెలంగాణ నాయకత్వానికి పెరుగుతున్న అంతర్జాతీయ గుర్తింపుకు ఈ ఆహ్వానం నిదర్శనంగా ప్రభుత్వం అభిప్రాయపడుతుంది.

ఇటీవల హార్వార్డ్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీడర్షిప్ కోర్స్ పూర్తి చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే నిర్వాహకులు స్వయంగా కలిసి ఆహ్వానం అందజేసినట్లు సమాచారం. తెలంగాణను గ్లోబల్ ఏఐ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను హార్వార్డ్ యూనివర్సిటీ నిర్వాహకులు ప్రశంసించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు