Rythu Bharosa : రైతులకు శుభవార్త.. ఖాతాలలో రైతు భరోసా డబ్బులు..!
తెలంగాణ రైతాంగం ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగి సీజన్ సగం పూర్తయినా ఇప్పటివరకు రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అందలేదు. మున్సిపల్ ఎన్నికలు అడ్డంకిగా ఉన్నాయని, ఎన్నికలు పూర్తవగానే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

Rythu Bharosa : రైతులకు శుభవార్త.. ఖాతాలలో రైతు భరోసా డబ్బులు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రైతాంగం ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగి సీజన్ సగం పూర్తయినా ఇప్పటివరకు రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అందలేదు. మున్సిపల్ ఎన్నికలు అడ్డంకిగా ఉన్నాయని, ఎన్నికలు పూర్తవగానే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా ఈనెల 16వ తేదీతో మున్సిపల్ ఎన్నికల కోడ్ కూడా ముగిసింది. అయినా కూడా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ కాకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు ఎకరానికి 12 వేల రూపాయలను ప్రతి ఏటా రెండు విడతలుగా అందజేస్తుంది. వానకాలం సీజన్ లో పంటలు ప్రారంభం కాగానే మొదటి విడత 6000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసింది. కానీ రెండవ విడత యాసంగి సీజన్ లో రైతు భరోసాను ఇప్పటివరకు అందజేయలేదు.
పంటలు సాగు చేసిన వారికి మాత్రమే రైతు భరోసా అందించేందుకుగాను ప్రభుత్వం శాటిలైట్ సర్వే చేపట్టింది. శాటిలైట్ సర్వే ఆధారంగా రైతు భరోసాను రైతుల ఖాతాలలో జమ చేసేందుకు సిద్ధపడింది. దానివల్ల నిధులు దుబారా కాకుండా కేవలం పంటలు సాగు చేసిన వారికి మాత్రమే సహాయం అందనున్నాయి. కానీ ప్రభుత్వం శాటిలైట్ ఆధారంగా రైతు భరోసా అందజేస్తుందా..? లేదా పాత పద్ధతిలోనే ఈ సీజన్ వరకు రైతుల ఖాతాలలో జమ చేస్తారా..? అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
సోమవారం తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నారు. క్యాబినెట్ సమావేశంలో మంత్రులు ఈ విషయంపై చర్చించే అవకాశం ఉంది. సమావేశం అనంతరం రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకొని రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నారు.