Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District Collector : ప్రజావాణికి వెల్లువలా దరఖాస్తులు.. వికలాంగులు, వృద్ధుల వద్దకే వెళ్లి కలెక్టర్ దరఖాస్తుల స్వీకరణ..!

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి గత కొద్ది రోజులుగా లేకపోవడం వల్ల జిల్లా కలెక్టర్ నిర్వహించే ప్రజావాణి కి సోమవారం దరఖాస్తులు వెలువల వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు భారీగా క్యూలైన్ నిలుచునే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా వృద్ధులు, వికలాంగుల వద్దకు వెళ్లి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అక్కడే దరఖాస్తులు స్వీకరించారు.

District Collector : ప్రజావాణికి వెల్లువలా దరఖాస్తులు.. వికలాంగులు, వృద్ధుల వద్దకే వెళ్లి కలెక్టర్ దరఖాస్తుల స్వీకరణ..!

నల్లగొండ, మన సాక్షి :

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి గత కొద్ది రోజులుగా లేకపోవడం వల్ల జిల్లా కలెక్టర్ నిర్వహించే ప్రజావాణి కి సోమవారం దరఖాస్తులు వెలువల వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు భారీగా క్యూలైన్ నిలుచునే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా వృద్ధులు, వికలాంగుల వద్దకు వెళ్లి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అక్కడే దరఖాస్తులు స్వీకరించారు.

పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు .ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు .
అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని వేగంగా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.

పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిశీలించి, నిర్దిష్ట గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సోమవారం మొత్తం 138 వ్యాధులు రాగా రెవిన్యూ శాఖకు 78 , తక్కిన 60 వివిధ శాఖలకు చెందిన ఫిర్యాదులు ఉన్నాయి. రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, చండూరు ఆర్టీవో శ్రీదేవి, దేవరకొండ ఆర్డి ఓ. రమణారెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

MOST READ 

  1. Friendship : స్నేహితులంతా ఒక్కటయ్యారు.. తోటి మిత్రుడు కుటుంబాన్ని ఆదుకున్నారు..! 
  2. Rythu Bharosa : రైతులకు శుభవార్త.. ఖాతాలలో రైతు భరోసా డబ్బులు..!
  3. Suryapet : సూర్యాపేట జిల్లాలో నకిలీ పురుగుమందుల గుట్టురట్టు..!
  4. Artificial Intelligence : ఏఐ స్టార్టప్ విలేజ్ ఏర్పాటుకు తెలంగాణ సిద్ధం..!

మరిన్ని వార్తలు