TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుహైదరాబాద్

పైకి మాత్రం సీజ్.. లోన మాత్రం పనులు, ఆగని అక్రమ నిర్మాణాలు..!

మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ప్రజల ఒత్తిడితో తూతు మంత్రంగా అక్రమ నిర్మాణ బిల్డింగ్స్ సీజ్ చేస్తున్న అధికారులు. కానీ వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం యధావిధిగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

పైకి మాత్రం సీజ్.. లోన మాత్రం పనులు, ఆగని అక్రమ నిర్మాణాలు..!

మేడ్చల్ మల్కాజిగిరి, మనసాక్షి:

మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ప్రజల ఒత్తిడితో తూతు మంత్రంగా అక్రమ నిర్మాణ బిల్డింగ్స్ సీజ్ చేస్తున్న అధికారులు. కానీ వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం యధావిధిగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈనెల 11 బుధవారం పివిఎన్ కాలనీలో జరుగుతున్న ఓ అక్రమ నిర్మాణాన్ని అధికారులు బందోబస్తుగా వెళ్లి బిల్డింగ్ ను సీజ్ చేశారు.

ఇదేది లెక్కచేయకుండా యధావిధిగా నిర్మాణ పనులు చేపట్టారు. వీటిపై స్థానికులు డిప్యూటీ కమిషనర్ కి ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి ఏసీపీకి ఫోన్ చేసి మాట్లాడి సీజ్ చేసిన బిల్డింగ్ ఏవిధంగా నిర్మాణాలు చేపడతారు. అక్కడికి వెళ్లి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ నిర్మాణదారులకు స్థానిక అధికారుల అండదండలు ఉన్నాయి.

అక్రమ నిర్మాణా సంపాదనకు అలవాటుపడ్డ అధికారులు ప్రజల ఫిర్యాదుల ఒత్తిడి వలన సీజింగ్ చేయడం అనే ఒక నాటకం ఆడుతున్నారు. సీజ్ చేయడం దేనికి తీసుకున్న ముడుపులకు న్యాయం చేయడానికి తూతు మంత్రంగా సీజ్ చేసి తర్వాత నిర్మాణం చేసుకోండి అని చెప్తున్నారేమోనని స్థానికులు అనుమానం వ్యక్తపరిచారు. అక్రమ నిర్మాణాన్ని ప్రోత్సహించడం దేనికి, నిర్మాణ దశలోనే అడ్డుకుంటే బాగుంటుంది కదా. అలా అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని కూల్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే అక్రమ నిర్మాణం చేయాలని ఏ ఒక్కరికి ఆలోచన కూడా రాదని వారు కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడమే ఒక నేరం, అలాంటిది అధికారులు సీజ్ చేసిన బిల్డింగ్ ని నిర్మాణం చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

MOST READ : 

మరిన్ని వార్తలు