Nalgonda : తీదేడులో రేపటి నుంచి శ్రీశ్రీశ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు..!
నల్గొండ జిల్లా మండల పరిధిలోని వెంకటం పేట ( తీదేడు ) గ్రామంలో గత 250 సంవత్సరాల క్రితం పూర్వికులు నెలకొల్పబడిన శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయం జిల్లాలో ఎంతో ప్రావీణ్యం పొందుతుంది. ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా ఈ సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు సర్వం సన్నద్ధం చేస్తున్నారు.

Nalgonda : తీదేడులో రేపటి నుంచి శ్రీశ్రీశ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు..!
చింతపల్లి, మనసాక్షి:
నల్గొండ జిల్లా మండల పరిధిలోని వెంకటం పేట ( తీదేడు ) గ్రామంలో గత 250 సంవత్సరాల క్రితం పూర్వికులు నెలకొల్పబడిన శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయం జిల్లాలో ఎంతో ప్రావీణ్యం పొందుతుంది. ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా ఈ సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు సర్వం సన్నద్ధం చేస్తున్నారు.
ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మార్చి 1వ తేదీ నుండి మార్చి 10వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలతో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం సందర్భంగా గుట్టపై ఆలయ ప్రాంగణంలో భక్తుల రాక కోసం సర్వం సన్నద్ధం చేస్తున్నారు.
కార్యక్రమ వివరాలు :
- 1వ తేదీన స్వామి వారి విగ్రహాలు బుట్ట పైకి తరలించడం.
- 4 తేదీ నుండి 9వ తేదీ వరకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత ఉత్సవ కార్యక్రమాలు.
- 5 తేదీన సాయంత్రం ఏడు గంటలకు స్వామి వారి కళ్యాణ మహోత్సవం.
- 9వ తేదీన వనమాసం.
- 10 వ తేదీన స్వామివారి రథోత్సవ కార్యక్రమం.
అనంతరం స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి, సురభి సత్యనారాయణ శర్మ, స్థానిక సర్పంచ్ పుల్పాల స్వప్న శేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఈ కార్యములలో పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు జిల్లా నలుమూలల నుండి వేలాదిమంది భక్తులు హాజరై స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఉత్సవ నిర్వాహకులు పేర్కొన్నారు.
By : puppala venkteshwarlu, Sr.Reporter
MOST READ :
- Big Alert : రైతులకు బిగ్ అలర్ట్.. ఈరోజే చివరి తేదీ, అలా చేయకుంటే పథకాలు, రాయితీలు అందవు..!
- Fake Company : నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు.. బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్..!
- Miryalaguda : మిర్యాలగూడలో నకిలీ వైద్యుల గుట్టు రట్టు.. ఐదుగురి అరెస్టు..!
- TG : రాష్ట్ర వ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు..!