Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట పట్టణ మెయిన్ రోడ్డు పై ఆక్రమణ తొలగింపు..!

ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అడ్డంకులు సృష్టించవద్దు అని సూర్యాపేట ట్రాఫిక్ ఎస్సై సాయిరాం తెలిపారు.

Suryapet : సూర్యాపేట పట్టణ మెయిన్ రోడ్డు పై ఆక్రమణ తొలగింపు..!

సూర్యాపేట, మన సాక్షి:

ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అడ్డంకులు సృష్టించవద్దు అని సూర్యాపేట ట్రాఫిక్ ఎస్సై సాయిరాం తెలిపారు. సూర్యాపేట పట్టణంలో రోజురోజుకి పెరుగుతున్న ప్రజల రద్దీ వాహనాల రద్దీ దృష్ట్యా రహదారులు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారాలను తొలగించడం జరిగిందని అన్నారు.

సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో ఆక్రమణలు తొలగించి రోడ్డుపై ఉన్న మట్టి కుప్పలను తొలగించారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఉండటం కోసమే ఈ చర్యలు తీసుకున్నామని ట్రాఫిక్ ఎస్ఐ అన్నారు. ప్రజలు ఎవరు కూడా రోడ్లను ఆక్రమించి వ్యాపారాల నిర్వహించవద్దని వస్తువులను రోడ్ల మీదికి పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని కోరారు.

MOST READ 

మరిన్ని వార్తలు