Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsనిజామాబాద్వైద్యం

DMHO : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికంగా తనిఖీ..!

నిజామాబాద్ జిల్లా ​ఆలూర్ మండలం కల్లెడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గుత్ప సబ్ సెంటర్‌ను బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

DMHO : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికంగా తనిఖీ..!

ఆర్మూర్, మన సాక్షి

నిజామాబాద్ జిల్లా ​ఆలూర్ మండలం కల్లెడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గుత్ప సబ్ సెంటర్‌ను బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో చిన్నపిల్లలకు వేస్తున్న టీకాలు, గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆమె ఆరా తీశారు. టీకాలు ఇచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిస్టర్స్, ఆశా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ప్రతి గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం అయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం సబ్ సెంటర్‌లోని అన్ని రిజిస్టర్లను పరిశీలించి, రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ తగిన మార్గదర్శకాలను అందించారు.

MOST READ :

మరిన్ని వార్తలు