Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలురాజకీయం

Suryapet : కొత్తగూడెం, గోరెంట్ల రోడ్డు పనులను చేపట్టాలని అర్ధనగ్న ప్రదర్శన..!

తుంగతుర్తి మండలం లోని కొత్తగూడెం గ్రామంలో.. గోరెంట్ల, కొత్తగూడెం రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు.

Suryapet : కొత్తగూడెం, గోరెంట్ల రోడ్డు పనులను చేపట్టాలని అర్ధనగ్న ప్రదర్శన..!

తుంగతుర్తి, మన సాక్షి:

తుంగతుర్తి మండలం లోని కొత్తగూడెం గ్రామంలో.. గోరెంట్ల, కొత్తగూడెం రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ గత కెసిఆర్.ప్రభత్వం లో మాజీ శాసనసభ్యులు కిశోర్ ప్రత్తిపాధనలో రోడ్డు మంజూరి కావడం జరిగింది. ఆ తరువాత కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన శాసనసభ్యులు మందుల సామేల్ హడాఉడిగా శంకస్థాపన చేసి రెండేండ్లయిన ఇంతవరకు పనులు ప్రారంభించక పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలియచేసారు..

అలాగే మండలం లోని తుంగతుర్తి.. వెంపటి. తూర్పుగూడెం.వెంపటి. బండ రామారం గుండెపురి.బండరామారం రోడ్లను వెంటనే పనులు పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యుల ను డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలోజిల్లా నాయకులు గిందాగాని రాములుగౌడ్ మాజీ వైస్ ఎంపీపీ మట్టిపెల్లి శ్రీశైలం.సర్పంచ్ మేడదుల రమేష్. ఉపసర్పంచ్ మహేష్ నాయకులు సిమ్మద్రి. కరుణాకర్. కేశవరెడ్డి.సత్యనారాయణ. పాపులు. సందీప్. ప్రవీణ్. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు