Madgulapally : మద్యానికి బానిసై మనోవేదనతో వ్యక్తి ఆత్మహత్య..!
మద్యానికి బానిసై వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాడ్గులపల్లి మండలం, కుక్కడం గ్రామంలో చోటు చేసుకుంది.

Madgulapally : మద్యానికి బానిసై మనోవేదనతో వ్యక్తి ఆత్మహత్య..!
మాడుగులపల్లి, మన సాక్షి:
మద్యానికి బానిసై వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాడ్గులపల్లి మండలం, కుక్కడం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కడం గ్రామానికి చెందిన ఆవుల మల్లేష్ (41) గత కొంత కాలంగా తాగుడుకు బానిసై ఏమి పనికి వెళ్లకపోవడంతో భార్య భర్తలు ఇద్దరూ ఎప్పుడు గొడవ పడుతుండేవారు. గురువారం రోజు ఇద్దరి మధ్యన గొడవ జరగడంతో తన భార్య పుట్టింటికి వెళ్లిపోగా ఆరోజు రాత్రి సమయంలో తన ఇంట్లో ఫ్యాన్ కు చిరతో ఉరీ వేసుకుని చనిపోయాడు.
అతని తమ్ముడు అయిన ఆవుల వెంకన్న చూసి చెప్పగా విషయం తెలిసింది. అని భార్య శైలజా ఇచ్చిన పిర్యాధుపై మాడ్గుల పల్లి ఎస్‌ఐ క్రిష్ణయ్య కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టి, మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి, అంతిమ సంస్కారాల నిమిత్తం బందువులకు అప్పగించినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. మృతునికి ఇంటర్ చదువుతున్న ఒక కూతురు సంతానం కలదు.
MOST READ :
- TG : తెలంగాణలో ఆ రైతులకు శుభవార్త.. ఎకౌంట్లోకి డబ్బులు, చెక్ చేసుకోండి..!
- Good News : నిరుద్యోగులకు శుభవార్త.. ఆ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!
- Ration Cards : రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- Nalgonda : నల్గొండ జిల్లాలో హోలీ వేడుకల్లో తీవ్ర విషాదం.. సాగర్ ఎడమ కాలువలో ఇద్దరు గల్లంతు..!









