Rythu Bharosa : రైతు భరోసా ఉందా..? లేదా..?
తెలంగాణలో రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ఉందా..? లేదా..? అని రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు. గత ఏడాది జనవరి 26 కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం ప్రారంభించారు.

Rythu Bharosa : రైతు భరోసా ఉందా..? లేదా..?
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ఉందా..? లేదా..? అని రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు. గత ఏడాది జనవరి 26 కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రైతులకు ఎకరానికి ఏడాదికి 12,000 రూపాయలను పెట్టుబడి సహాయంగా అందజేయనున్నారు. రెండు విడతలుగా ఎకరానికి 6000 రూపాయలు చొప్పున అందజేసే ఈ పథకం ప్రారంభించారు.
గత ప్రభుత్వం రైతుబంధు ద్వారా ఎకరానికి పదివేల రూపాయలను అందించేది. కాగా రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి 15 వేల రూపాయలను రెండు విడుతలుగా అందజేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ 12 వేల రూపాయలను అందజేస్తామని ప్రారంభించారు.
వానకాలం సీజన్ లో రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 6000 రూపాయలను రైతుల ఖాతాలలో నేరుగా జమ చేసింది. యాసంగి సీజన్ పూర్తి కావస్తున్నప్పటికీ కూడా రైతులకు ఇప్పటివరకు రైతు భరోసా పథకం అమలు చేయలేదు. ఒక సీజన్ రైతులకు సుమారు 9000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. అందుకు గాను జనవరి మాసంలో రైతు భరోసా అమలు చేస్తామని ప్రకటించారు.
ALSO READ : Gold Price : బంగారం ధర వరుసగా తగ్గుతుంది తెలుసా.. ఈరోజు ఎంతంటే..!
కానీ అమలుకు నోచుకోలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా మున్సిపల్ ఎన్నికల అనంతరం రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని మిర్యాలగూడ బహిరంగ సభలో పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు రైతు భరోసా పథకం అమలుకు నోచుకోలేదు. రాబోయే ఖరీఫ్ సీజన్ ప్రణాళికకు సంబంధించి వ్యవసాయ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. కానీ రైతు భరోసా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
దాంతో రైతులు రైతు భరోసా పథకం అమలు చేస్తారా..? లేదా..? అని ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి సహాయంగా అందజేసే రైతు భరోసా పథకం వల్ల సన్న, చిన్నకారు రైతులకు ఎంతో మేలు జరిగేది. కానీ ప్రస్తుతం ఆ పథకం రాకపోతే ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా ఈ పధకంపై స్పష్టమైన ప్రకటన చేయాలని రైతులు పేర్కొంటున్నారు.









