Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతరలుజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : ప్రతి ఒక్కరూ శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి..!

ప్రతి ఒక్కరూ శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్, రాష్ట్ర నాయకులు కంకణాల వెంకటరెడ్డి లు అన్నారు.

Nalgonda : ప్రతి ఒక్కరూ శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి..!

బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్

చింతపల్లి, మన సాక్షి :

ప్రతి ఒక్కరూ శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్, రాష్ట్ర నాయకులు కంకణాల వెంకటరెడ్డి లు అన్నారు. సోమవారం చింతపల్లి మండలంలోని గోడుకొండ్ల, వెంకటేశ్వర నగర్ (మాల్) గ్రామంలో నిర్వహించిన శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆయన అన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంత లభిస్తుందని,.శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ ఉండాలని అని ఆయన కోరారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, కొండూరు శ్రీనివాస్, మల్లోజు జగన్, బద్దేపల్లి పులిరాజ్ గౌడ్ జిట్ట జగదీష్ , పూల యాదయ్య, కంకణాల రాజు,మల్లోజు గోపి, కట్కూరి నారాయణ గౌడ్ జుర్రిగల రామకృష్ణ, బీరెల్లి మహేందర్, మాదారం శేఖర్, మాదారం జగదీష్, శేఖర్ గౌడ్ మాదారపు వెంకటేష్, గ్యార పోచయ్య, శ్రీనివాస్ చారి,,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు