Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయి.. మేయర్ చైతన్య రెడ్డి..!

ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయన్న నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం అమలులో భాగంగా సోమవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల మైదానం నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన 5 కే రన్ ను నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి జండా ఊపి ప్రారంభించారు.

Nalgonda : ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయి.. మేయర్ చైతన్య రెడ్డి..!

నల్లగొండ, మన సాక్షి

ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయన్న నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం అమలులో భాగంగా సోమవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల మైదానం నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన 5 కే రన్ ను నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్లేనని, అందువల్ల ప్రతి ఒక్కరూ వారి వారి ఆరోగ్యాలపై దృష్టి సారించాలని కోరారు.

ప్రతి ఒక్కరు ప్రతినిత్యం ఇంట్లో కాకుండా, బయటకు వచ్చి వాకింగ్ లేదా వ్యాయామం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారు ఆ పథకాల లబ్ది పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యచరణ ప్రణాళికను చేపట్టిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం , ప్రభుత్వ పథకాల్ని ప్రజలకు చేరవేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. “ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదు. ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయి” అని కలెక్టర్ అన్నారు.

ప్రస్తుతం చాలామంది లైఫ్ స్టైల్ సమస్యలతో బాధపడుతున్నారని, వాటిని దూరం చేసుకోవడానికి ఫిట్‌నెస్ అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని భాగంగా చేసుకోవాలని, ప్రతిరోజూ శక్తి మేరకు నడక లేదా వ్యాయామం చేయాలని సూచించారు 5 కె రన్ ను ఎన్జీ కాలేజీ నుండి క్లాక్ టవర్ వరకు కొనసాగించారు.

అనంతరం మానవహారం నిర్వహించి రన్ లో పాల్గొన్న వారితో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్లు పెరిక స్వాతి , మామిడి కార్తీక్ డాక్టర్ పుల్లారావు, ప్రజాప్రతినిధులు, యువత అధికారులు. మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By : Shekar,  Nalgonda

మరిన్ని వార్తలు