Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : సాగర్ ఎడమ కాలువ లో గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభ్యం..!

నాగార్జునసాగర్ ఎడమ కాలువలో గల్లంతయిన వ్యక్తి ఆచూకీ లభ్యమైంది.

Miryalaguda : సాగర్ ఎడమ కాలువ లో గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభ్యం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నాగార్జునసాగర్ ఎడమ కాలువలో గల్లంతయిన వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. ఆదివారం మధ్యాహ్నం మండలంలోని తడకమళ్ళ గ్రామ శివారులోని (తలుపుల దగ్గర) తన మనవళ్లతో కలిసి స్నానం చేస్తుండగా..

వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన తమ్మిశెట్టి పెద్ద వెంకన్న ప్రమాదశాత్తు కాల్వలో జారిపడి మృతి చెందారు. మృతుని అల్లుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు…

మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. పొనుగోడు సమీపంలో మృతదేహం లభ్యమైనట్టు ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.

ALSO READ : Nalgonda : ప్రతి ఒక్కరూ శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి..!

మరిన్ని వార్తలు