జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ డిఎస్పీకి జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..!

మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సిబ్బందిని ఆదేశించారు.బుధవారం నల్గొండ పట్టణంలోని ఎస్ ఎల్ బి సి మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసారు.

Nalgonda : నల్గొండ డిఎస్పీకి జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..!

నల్లగొండ, మన సాక్షి :

మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సిబ్బందిని ఆదేశించారు.బుధవారం నల్గొండ పట్టణంలోని ఎస్ ఎల్ బి సి మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్బంగా కలెక్టర్ హాస్టల్ లోని గదులను వంట గదిని పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులను వంట బాగుందా? మెను ప్రతిరోజు అమలు చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు.పాఠశాల సమీపంలో పాన్, గుట్కా షాపులు కనిపించడంతో పాఠశాలలకు వంద మీటర్ల దూరంలో పాన్, గుట్కా షాపులు లేకుండా చూడాలని డిఎస్పి కి సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా మైనారిటీ అధికారి విజయెందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ వేణు గోపాల్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు