TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్

LPG GAS : గ్యాస్ బుకింగ్ సర్వర్ డౌన్.. హాస్టల్స్, హోటల్స్ లో తీవ్ర ఇబ్బందులు..!

ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ తో వంట గ్యాస్ కొరత ఏర్పడింది. దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

LPG GAS : గ్యాస్ బుకింగ్ సర్వర్ డౌన్.. హాస్టల్స్, హోటల్స్ లో తీవ్ర ఇబ్బందులు..!

మన సాక్షి, హైదరాబాద్ :

ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ తో వంట గ్యాస్ కొరత ఏర్పడింది. దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే విధంగా గ్యాస్ రీఫిలింగ్ కోసం బుకింగ్ చేసేందుకు కూడా సర్వర్లు డౌన్ కావడంతో బుకింగ్ కావడం లేదు. ఒకేసారి వేలాదిమంది బుకింగ్ కోసం ప్రయత్నిస్తూ ఉండటం వల్ల సర్వర్ డౌన్ కారణంగా బుకింగ్ లేదు. గ్యాస్ కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ మహానగరంలో హాస్టల్స్, హోటల్స్ లో కట్టెల పోయిలను వినియోగిస్తున్నారు.

ఇప్పటికే 40 శాతం హోటల్స్ మూతపడ్డాయి. కొన్ని హోటల్స్ లో వంటలు కట్టలపై చేస్తున్నారు. దాంతో రేట్లు కూడా పెంచారు. టిఫిన్స్ కు 20 రూపాయలు, టి ఐదు రూపాయలు అదనంగా పెంచారు. ఇక ఐటి కంపెనీలలోని క్యాంటీన్ల లో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాళ్లు పెట్టింది తినాలని, లేదంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలని పేర్కొంటున్నారు. గ్యాస్ ఏజెన్సీ లతో తెలంగాణ సివిల్ సప్లై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సమావేశం అయ్యారు. గ్యాస్ ఏజెన్సీలు బ్లాక్ లో విక్రయిస్తే ఏజెన్సీ రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

MOST READ 

మరిన్ని వార్తలు