Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Bandi Sanjay : బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్రలో అపశృతి..!

కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అంజన్న ఆశీర్వాద యాత్రలో అపశృతి చోటు చేసుకుంది.

Bandi Sanjay : బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్రలో అపశృతి..!

కరీంనగర్, మనసాక్షి :

కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అంజన్న ఆశీర్వాద యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రాజకీయాలతో సంబంధం లేకుండా భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. వెదిర శివారులో ఒక్కసారిగా తేనెటిగాలు లేచి వారిపై దాడి చేశాయి. తేనేటిగాల భారీ నుంచి తప్పించుకునేందుకు జనం పరుగులు తీశారు.

కాగా ఈ దాడిలో బండి సంజయ్ కీ ప్రమాదం తప్పిందనే చెప్పాలి. పాదయాత్రలో తను ముందు వస్తుండగా.. వెనుకాల వచ్చే వారిపై దాడి చేసినట్లు తెలుస్తుంది. తేనెటీగల దాడిలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే బండి సంజయ్ అంబులెన్సు లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాదయాత్ర యధావిధిగా కొనసాగుతుంది.

ఇవీ చదవండి

మరిన్ని వార్తలు