Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి.. వ్యవసాయాధికారి..!

అర్హులైన రైతులందరూ రైతు భరోసా పథకం లబ్ధి కోసం మార్చి 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి ఒక ప్రకటనలో కోరారు.

Rythu Bharosa : రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి.. వ్యవసాయాధికారి..!

అర్హులైన రైతులందరూ రైతు భరోసా పథకం లబ్ధి కోసం మార్చి 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఫిబ్రవరి 28వ తేదీ నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు, ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

MadhavaReddy Ao

దరఖాస్తుదారులు తమ దరఖాస్తు పత్రంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం నకలు, ఫోన్ నెంబర్ జతచేసి, సంబంధిత క్లస్టర్ల పరిధిలోని రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణాధికారులకు అందజేయాలని ఆయన పేర్కొన్నారు. రైతులు ఈ గడువును గమనించి త్వరగా తమ దరఖాస్తులను సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.

గుర్రంపోడు, మన సాక్షి:

ఇవీ చదవండి

మరిన్ని వార్తలు