District collector : ఆయిల్ ఫామ్ పరిశ్రమ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే..!
నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం గుత్ప గ్రామ శివారులో ఆయిల్ ఫామ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా కలిసి గుత్ప వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలోని భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఆర్మూర్, మన సాక్షి

ఈ సందర్భంగా పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఆయిల్ ఫామ్ పరిశ్రమను మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. పరిశ్రమ స్థాపనకు అవసరమైన అనువైన స్థలాల కోసం జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామని, అందులో భాగంగానే గుత్ప ప్రాంతాన్ని పరిశీలించినట్లు వెల్లడించారు.
ఈ పరిశ్రమ అందుబాటులోకి వస్తే స్థానిక రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హందన్, ఆలూర్ తహసీల్దార్ రమేష్, వివిధ శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.