Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Suryapet : పండగపూట విషాదం.. చెరువులో పడి వ్యక్తి మృతి..!
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని నూతనకల్ మండలం పెదనెమిల గ్రామంలో ఉగాది పండగ రోజున విషాదం నెలకొంది.

Suryapet : పండగపూట విషాదం.. చెరువులో పడి వ్యక్తి మృతి..!
తుంగతుర్తి మన సాక్షి :
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని నూతనకల్ మండలం పెదనెమిల గ్రామంలో ఉగాది పండగ రోజున విషాదం నెలకొంది. పెదనముల గ్రామానికి చెందిన నాగెల్లి రామస్వామి (60)అనే వ్యక్తి పండుగ సందర్భంగా తన పశువులను ముత్యాలమ్మ కుంటలో కడుగుతుండగా, ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. తన చేతి కర్ర నీటిలోకి వెళ్లడంతో దానిని తీసే క్రమంలో లోతులోకి వెళ్లి మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి రామస్వామి మృతదేహాన్ని బయటకి తీశారు. పండుగ వేళ ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.









