ఆంధ్రప్రదేశ్Breaking News

మిట్స్ అశ్వ ఫెస్ట్ పోటీలకు అవకాశం..!

మదనపల్లె సమీపంలో అంగళ్లు లోని మిట్స్ డీమ్డ్ టుబి యూనివర్సిటీ నందు అశ్వ్ 2026 - జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ లో భాగంగా నిర్వహిస్తున్న ఎక్స్టర్నల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో సోమవారం ప్రారంభం అవుతాయని యూనివర్సిటీ వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు.

మిట్స్ అశ్వ ఫెస్ట్ పోటీలకు అవకాశం..!

మదనపల్లి, మన సాక్షి :

మదనపల్లె సమీపంలో అంగళ్లు లోని మిట్స్ డీమ్డ్ టుబి యూనివర్సిటీ నందు అశ్వ్ 2026 – జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ లో భాగంగా నిర్వహిస్తున్న ఎక్స్టర్నల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో సోమవారం ప్రారంభం అవుతాయని యూనివర్సిటీ వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు.

ఇందులో క్రికెట్, కబ్బాడి, వాలీ బాల్ ఇతర ఆటల పోటీలకు నమోదు చేయని అభ్యర్థులు నేరుగా సోమవారం యూనివర్సిటీ నందు రిజిస్టర్ చేసుకోవచ్చని అన్నారు. ఇందులో జాతీయ స్థాయిలో డిప్లొమా, ఇంజనీరింగ్, డిగ్రీ,పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు.

వివరాలు కళాశాల అశ్వ్ వెబ్ సైట్ www.ashv2k.in లేదా www.mits.ac.in లో పొందుపరిచామని ఆయన అన్నారు. ఈ వెబ్ సైట్ నందు రిజిస్ట్రేషన్ వివరాలు మరియు పోటీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని తెలిపారు. ఇతర సందేహాల కోసం 91 9100601116 కు సంప్రదించవచ్చని తెలిపారు.

ఇవీ చదవండి

మరిన్ని వార్తలు