Gold Price : బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్క రోజులో రూ.29,400లకు..!
పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. పశ్చిమాసియా దేశాలలో యుద్ధం కారణంగా బంగారం ధరలు కూడా భారీగా పడిపోయినట్లు ప్రముఖులు పేర్కొంటున్నారు.

Gold Price : బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్క రోజులో రూ.29,400లకు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. పశ్చిమాసియా దేశాలలో యుద్ధం కారణంగా బంగారం ధరలు కూడా భారీగా పడిపోయినట్లు ప్రముఖులు పేర్కొంటున్నారు.
10 గ్రాముల (తులం) బంగారం లక్షన్నర కు దిగి వచ్చింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర శనివారం ఒక్కరోజే 29,400 రూపాయలు తగ్గింది. దాంతో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర 14 లక్షల 59 వేల 700 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం ధర శనివారం ఒకరోజు 27,500 పడిపోగా 100 గ్రాముల ధర 13 లక్షల 38 వేల రూపాయలకు చేరింది.
ఈరోజు తులం ధర ఎంతంటే..?
హైదరాబాద్ బంగారం మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్స్ (తులం) బంగారం కు ఒక లక్ష 45 వేల 970 రూపాయలకు ఉండగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం ధర 1,33,800 రూపాయలకు చేరింది. హైదరాబాదు నగరం తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలైనా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, వరంగల్, నల్గొండ, నిజామాబాద్, తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.