TOP STORIESBreaking Newsజాతీయం

WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. 15 నిమిషాల్లోనే డిలీట్.. ఎలా పని చేస్తుందంటే..!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ వాడని వారు లేరనే చెప్పవచ్చును. ఈ యాప్ తన వినియోగదారుల ప్రైవసీని మరింతగా పెంచేందుకు సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది.

WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. 15 నిమిషాల్లోనే డిలీట్.. ఎలా పని చేస్తుందంటే..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ వాడని వారు లేరనే చెప్పవచ్చును. ఈ యాప్ తన వినియోగదారుల ప్రైవసీని మరింతగా పెంచేందుకు సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ప్రస్తుతం వాట్సాప్ లో ఉన్న “డిజప్పియరింగ్” మెసేజ్ కు అదనంగా “ఆఫ్టర్ రీడింగ్” అనే కొత్త ఆప్షన్ ను అభివృద్ధి చేస్తుంది. దానివల్ల వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ ను చదివిన తర్వాత కేవలం 15 నిమిషాల్లోనే అది ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది.

ఎలా పనిచేస్తుందంటే :

ఈ వాట్సాప్ లో వచ్చే సరికొత్త ఫీచర్ ని యాక్టివేట్ చేశాక మీరు ఎవరికైనా మెసేజ్ పంపితే మెసేజ్ ను రిసీవర్ ఓపెన్ చేసి చదివిన వెంటనే 15 నిమిషాల కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. ఆ 15 నిమిషాలు మూగగానే పంపిన వారి ఫోన్లలో మెసేజ్ అందుకున్న వారి ఫోన్లలో చాట్ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది.

ఒకవేళ మెసేజ్ ఓపెన్ చేయకపోతే 24 గంటలపాటు అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా సిస్టం దానిని డిలీట్ చేస్తుంది. చాలామంది తమకు మెసేజ్ చదివినట్లు అవతలి వారికి తెలియకుండా రీడ్ రిసిప్స్ (బ్లూ టిక్స్) ఆఫ్ చేసి పెట్టుకుంటారు. అయితే ఈ కొత్త ఫీచర్ బ్లూ టిక్స్ ఆఫ్ లో ఉన్నప్పటికీ కచ్చితంగా పనిచేస్తుంది.

సైబర్ కు చిక్కకుండా :

మెసేజ్ ఓపెన్ చేయగానే వాట్సప్ సిస్టం దాన్ని ట్రాక్ చేసి 15 నిమిషాల వ్యవధిలోనే డిలీట్ చేస్తుంది. ప్రస్తుతం వాట్సాప్ లో మెసేజ్ కింద 24 గంటలు, 7 రోజులు, 90 రోజుల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫోటోలు వీడియోల కోసం వ్యూ వన్స్ ఆప్షన్ ఉంది. అయితే వన్ టైం పాస్వర్డ్ , బ్యాంకు వివరాలు, ఇతర రహస్యమైన, సున్నితమైన సమాచారాన్ని టెక్స్ట్ రూపంలో షేర్ చేసినప్పుడు అవి 24 గంటల పాటు చాట్ లో ఉండటం సురక్షితం కాకపోవచ్చును. అందువల్ల ఈ 15 నిమిషాల టైమర్ యూజర్ల డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా వాట్సాప్ నిర్వాహకులు దీనిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది :

వాట్సాప్ లో సరికొత్త ఫీచర్ ఒక నిర్దిష్టమైన చాట్ కు మాత్రమే కాకుండా అన్ని కాంటాక్ట్ లకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ రీడింగ్ ఫీచర్ ను ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ అప్డేట్ లో సంస్థ గుర్తించింది. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉన్నట్లు సమాచారం. టెస్టింగ్ పూర్తి కాగానే అందుబాటులోకి వస్తుంది. రాబోయే కొత్త అప్డేట్ లో వాట్సాప్ ఈ ఫీచర్ ని యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నది.

MOST READ 

మరిన్ని వార్తలు