Hyderabad : అక్రమంగా గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్..!
అక్రమంగా గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న ముఠాలపై శేరిలింగంపల్లి ఎస్ఓటీ (సొతం ) పోలీసులు ఉక్కుపాదం మోపారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పత్రిక నగర్లో బ్లాక్ మార్కెట్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.

Hyderabad : అక్రమంగా గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
అక్రమంగా గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న ముఠాలపై శేరిలింగంపల్లి ఎస్ఓటీ (సొతం ) పోలీసులు ఉక్కుపాదం మోపారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పత్రిక నగర్లో బ్లాక్ మార్కెట్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంబర్‌పేటకు చెందిన గణేష్ (36) అనే వ్యక్తి తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్లను సేకరించి, వాటిని మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో రంగంలోకి దిగిన శేరిలింగంపల్లి ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గణేష్ సుమారు రూ.1,800 విలువ చేసే కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ను అవసరమైన వారికి రూ.6 వేలకు విక్రయిస్తూ అక్రమంగా లాభాలు గడిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి నుంచి 31 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను తరలించేందుకు ఉపయోగిస్తున్న వాహనం స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.









