Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణ

జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి..!

జాతీయ రహదారి 563 పై మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

జాతీయ రహదారి 563 పై మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంకరపట్నం మండలం కేశవపట్నం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. కేశవపట్నం శివారులోని జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఓ లారీని వెనుక నుంచి మరో లారీ వేగంగా ఢీకొట్టింది. దాంతో వెనుక లారీలో ఉన్న డ్రైవర్ రావత్ సింగ్, క్లీనర్ ముఖేష్ సింగ్ లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయి మృతి చెందారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మృతుల వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు