కేంద్రం అనూహ్య నిర్ణయం.. పెట్రో ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ పన్ను తగ్గింపు..!
కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన కొరత వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రో ఉత్పత్తుల పైన కేంద్రం అదనపు ఎక్సైజ్ పన్నును భారీగా తగ్గించింది. దాంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి.

కేంద్రం అనూహ్య నిర్ణయం.. పెట్రో ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ పన్ను తగ్గింపు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన కొరత వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రో ఉత్పత్తుల పైన కేంద్రం అదనపు ఎక్సైజ్ పన్నును భారీగా తగ్గించింది. దాంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి.
వాహన వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ కలిగించింది. పెట్రోల్ పైన అదనపు ఎక్సైజ్ పన్నును భారీగా తగ్గించింది. పెట్రోల్ డీజిల్ పైన పది రూపాయల మేర ఎక్సైజ్ పన్ను తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ధరల తగ్గింపు పైన ఆయిల్ కంపెనీలు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
పెట్రోల్ పై ఉన్న 13 రూపాయల సుంఖం 10 రూపాయలు తగ్గించి మూడు రూపాయల చేసింది. డీజిల్ పైన ఉన్న సుంఖాన్ని పూర్తిగా రద్దు చేసింది. దాని ద్వారా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గడం ఖాయం. ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో ఉన్న ఎన్నికల కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.