Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking NewsTOP STORIESహైదరాబాద్

TG News : మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం..!

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేపట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని నినాదాలు, డిమాండ్ చేశారు.

TG News : మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేపట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని నినాదాలు, డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. ఈ నినాదాల మధ్య ప్రభుత్వం రెండు బిల్లులు ప్రవేశపెట్టింది. దాంతో బీఆర్ఎస్ నేతలు సభలో గందరగోళం సృష్టించారు. ఈ విషయం మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మైనింగ్ విషయంపై ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశించామని ఆయన పేర్కొన్నారు. సిఐడి దర్యాప్తుకు ఆదేశించిన తర్వాత హౌస్ కమిటీ ఎందుకు అని ప్రశ్నించారు. సిఐడి కంటే పెద్ద సంస్థ ఉంటుందా..? తప్పు చేస్తే ఎవరిని వదిలేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ దగ్గర ఆధారాలు ఉంటే సిఐడి కి ఇవ్వొచ్చని అన్నారు. నిరసనలతో సభను అడ్డుకోవాలని చూడటం సరికాదని స్పష్టం చేశారు. ఉదయం ముందుగా గన్ పార్క్ వద్ద పొంగులేటి అంశంపై ప్లకార్డులతో బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు.

మరిన్ని వార్తలు