Narayanpet : ఐదేళ్ల బాలిక హత్య కేసులో కీలక మలుపు.. మీడియాకు వివరించిన జిల్లా ఎస్పీ..!
నారాయణపేట మండలం పరిధిలోని అమ్మిరెడ్డి పల్లి లో సంచలం సృష్టించిన ఐదు సంవత్సరాల బాలిక హత్య కేసును పోలీసులు చేదించారు.

Narayanpet : ఐదేళ్ల బాలిక హత్య కేసులో కీలక మలుపు.. మీడియాకు వివరించిన జిల్లా ఎస్పీ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట మండలం పరిధిలోని అమ్మిరెడ్డి పల్లి లో సంచలం సృష్టించిన ఐదు సంవత్సరాల బాలిక హత్య కేసును పోలీసులు చేదించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మీడియా సమావేశంలో హత్యకేసు వివరాలను వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ గత నెల మార్చి 31న అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. బాలిక మృత దేహ పోస్టుమార్టం నిర్వహించగా బాలికపై లైంగిక దాడి చేసి అనంతరం హత్య చేసినట్లు
వెల్లాడైందన్నారు. ఎస్పీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా అమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బక్క చిన్న నరసింహులు (42)ను అదుపులోకి తీసుకొని విచారించగా అతను నేరాన్ని అంగీకరించాడని ఎస్పీ తెలిపారు.
తీసుకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు పై గతంలో అత్యాచారయత్నం కేసు నమోదు నమోదయిందని తెలిపారు. నిందితుని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఎస్ డి ఓ లింగయ్య బీసీ ఆర్ బి డిఎస్పి మహేష్ ఆధ్వర్యంలో కేసు చేదించడం జరిగిందని తెలిపారు.
అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రియాజ్ ఉల్ హక్, డిఎస్పి లింగయ్య, సిఐ శివశంకర్, ఎస్సై వెంకటేశ్వర్లు, రూరల్ ఎస్సై సతీష్ రెడ్డి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
MOST READ
- Breaking : కవల ఆడపిల్లల హత్య కేసు కీలక మలుపు.. కన్నతండ్రితో సహా నలుగురు అరెస్ట్..!
- Ibrahimpatnam : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్ కైవసం..!
- Karimnagar : తీవ్ర విషాదం, కన్న తండ్రి కర్కషం.. కవల పిల్లలను బావిలో పడేసి హత్య..!
- BREAKING : నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. పారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్య..!









