Miryalaguda : నల్గొండ జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు.. మిర్యాలగూడలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అప్పటి లోగా పంపిణీకి సిద్దం చేయాలి..!
సోమవారం మిర్యాలగూడ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ లు పరిశీలించారు.

Miryalaguda : నల్గొండ జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు.. మిర్యాలగూడలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అప్పటి లోగా పంపిణీకి సిద్దం చేయాలి..!
సోమవారం మిర్యాలగూడ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ లు పరిశీలించారు. ఈ నెలాఖరులోగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా వారు ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల పనుల పురోగతిని సమీక్షించారు. పరిశీలన సందర్భంగా మిగిలి ఉన్న అన్ని పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, విద్యుత్ సదుపాయం, ప్లంబింగ్ పనులు, టాయిలెట్లు, కిచెన్ ఏర్పాట్లు, రోడ్లు మరియు డ్రైనేజ్ వంటి మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
ఇళ్లన్నీ పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ఈ నెలాఖరులోగా లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. లబ్ధిదారులకు నాణ్యమైన వసతులు కల్పించడంలో ఎటువంటి రాజీ ఉండదని తెలిపారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా గృహ నిర్మాణం పిడి రాజ్ కుమార్, తహసిల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,ఆర్ అండ్ బి ఎస్ఈ శ్రీధర్ రెడ్డి,కలెక్టర్ వెంట ఉన్నారు .










