Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లామహబూబ్‌నగర్

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. యోగ జీవితంలో భాగం కావాలి..!

యోగ చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, రోజూవారి జీవనశైలిలో యోగ ప్రక్రియను ఒక భాగంగా దినచర్య అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ అన్నారు.

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. యోగ జీవితంలో భాగం కావాలి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :-

యోగ చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, రోజూవారి జీవనశైలిలో యోగ ప్రక్రియను ఒక భాగంగా దినచర్య
అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ హెల్త్ వీక్ లో భాగంగా హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టి యన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానిమాన్ 271వ జయం తిని పురస్కరించుకుని ప్రపంచ హోమియోపతి ( ఆయుష్ డే ) దినోత్సవ యోగ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్లు ఫణీంద్ర రెడ్డి, శ్రీను తో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ యోగా చేయ డం ద్వారానే సంపూర్ణమైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ప్రజల దినచర్యలో యోగా ఒక భాగంగా అలవర్చుకో వాలని ఉదయం గంట పాటు యోగ చేయడం ద్వారా శరీరం మెదడు చురుకుగా పనిచేస్తాయని తెలిపారు. పురాతన కాలం నుంచి యోగాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంపూర్ణమైన ఆరోగ్యం ద్వారా మాత్రమే మనిషి తన ఆశలను ఆశయాలను ఉన్నత లక్ష్యాలను సాధించ వచ్చని పేర్కొన్నారు. సమయం దొరికినప్పుడల్లా తాను యోగా చేస్తానని తెలిపారు. తన సోదరి ద్వారా యోగా నేర్చుకున్నానని ఆయన చెప్పారు. బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ మాట్లాడుతు యోగా జీవితంలో భాగం కావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, రాజకీయ ప్రముఖులు, వైద్యులు, ఆరోగ్య శాఖ ఉద్యోగులు, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు, ఆశా కార్యకర్తలు, పతంజలి సభ్యులుఆయుష్ సిబ్బంది, యోగాసనాలు వేసి అందర్నీ ఉత్తేజపరిచారు. ఈ కార్య క్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, డి ఎం హెచ్ ఓ డాక్టర్ జయ చంద్రమోహన్, డిఆర్డిఏ మొగులప్ప, యోగా శిక్షకులు సురేష్, మెడికల్ కళాశాల విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు