Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguada : ఘనంగా జ్యోతి రావు పూలే 199వ జయంతి..!

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి రావు పూలే 199 వ జయంతి ని శనివారం మిర్యాలగూడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

Miryalaguada : ఘనంగా జ్యోతి రావు పూలే 199వ జయంతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి రావు పూలే 199 వ జయంతి ని శనివారం మిర్యాలగూడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్బంగా కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. భారతదేశంలో సమూల మార్పులు తీసుకొచ్చి సమసమాజ స్థాపన కోసం కుల నిర్మూలన, ప్రతి ఒక్కరికి విద్య అవకాశాలు, కుల మత భేదం లేకుండా చదువుకోవాలన్న ఏకైక లక్ష్యంతో మొట్టమొదటగా తన భార్యను సావిత్రిబాయి పూలేకు చదువు చెప్పించి భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దున మహానీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే ని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా సమ సమాజ స్థాపన కోసం కృషి చేయాలని, కుల మత భేదం లేకుండా ముందుకు సాగాలని వారి ఆశయ సాధన కోసం మనందరం కృషి చేయాలని అన్నారు.

విద్య లేని వాడు వివేకం లేని వాడు అవుతాడు అని నమ్మి
నేడు మన ప్రభుత్వం కూడా ఫూలే ఆశయాలకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.

ప్రజా ప్రభుత్వం ప్రతి అడుగులోనూ ఆయన స్ఫూర్తి కనిపిస్తుందని తెలియజేసారు.
ఫూలే కన్న కలలను సాకారం చేయడానికి, కుల మత రహిత సమాజాన్ని నిర్మించడానికి మనమంతా ఐక్యంగా కృషి చేద్దామన్నారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, మిర్యాలగూడ బ్లాక్ కకాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, వేములపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాలి కాంతరెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు ఉబ్బపల్లి కాశయ్య, ముండ్ల గిరి కాంతయ్య, బొప్పని నాగేష్, దైద సురేష్, వెంకటేశ్వర్లు శ్రీనివాస్, ప్రజాసంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు