Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

విభజన హామీలు నెరవేర్చడంలో విఫలమైన బీజేపీ – మంత్రి జగదీశ్ రెడ్డి

విభజన హామీలు నెరవేర్చడంలో విఫలమైన బీజేపీ – మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, మనసాక్షి: తెలంగాణ ఈ విషయంలో లో కేంద్ర క్షుద్ర రాజకీయం చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోసమే ఢిల్లీలో కేంద్రం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేస్తుందన్నారు. ఇన్నాళ్లకు బీజేపీ కి తెలంగాణ ఆవిర్భావ దినం గుర్తుకు రావడం ఆశ్చర్య కలిగిస్తున్నా…శుభ పరిణామం అని పేర్కొన్నారు.

తెలంగాణ పై నిత్యం విషం కక్కుతున్న మోడీ, మంత్రి వర్గంలోని కీలక మంత్రి అమిత్ షా ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. విభజన హామీలు నెరవేర్చడంలో విఫలమైన బీజేపీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపడం ఒక డ్రామా అని పేర్కొన్నారు. జాతీయ సమావేశాల్లో తెలంగాణకు ఎం చేసిందో స్పష్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో 24 గంటలు కరెంటు , పుష్కలంగా నీళ్లు ఉండటం వల్లనే జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తున్నారని అన్నారు.

సమావేశాలకు వచ్చిన బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఇక్కడ అభివృద్ధిని చూసి నేర్చుకొని పొతే మంచిదని పేర్కొన్నారు. 8 ఏండ్ల క్రితం తెలంగాణాలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు గుజరాత్ లో ఉన్నాయని, కెసిఆర్ ఢిల్లీ కి వస్తున్నాడానే, బీజేపీ అగ్ర నాయకత్వం మొత్తం ఉలిక్కిపడి హైదరాబాద్ వస్తున్నారని అన్నారు.

ఇవి కూడా చదవండి :

1. చిన్నతనం నుంచి దొంగతనాలే,  అంతర్ జిల్లా బైకుల దొంగ అరెస్టు

2. బంగ్లాదేశ్ టు భారత్ : నదిలో ఈది.. ప్రియుడు చెంతకు చేరిన మహిళ..!

3. అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య

మరిన్ని వార్తలు