Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Nalgonda : నల్గొండలో తేజస్వి సూర్య బొమ్మ దహనం..!

పార్లమెంట్లో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చాడాని నిరసిస్తూ నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో ఎంపీ దిష్టిబొమ్మ దహనం చేశారు.

Nalgonda : నల్గొండలో తేజస్వి సూర్య బొమ్మ దహనం..!

నల్లగొండ, మన సాక్షి.

పార్లమెంట్లో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చాడాని నిరసిస్తూ నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో ఎంపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. నల్గొండ పట్టణంలో క్లాక్ టవర్ వద్ద కాంగ్రెస్ నేతలు నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టి అనంతరం తేజస్వి సూర్య దిష్టి బొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత గారు మాట్లాడుతూ ఆనాడు యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందని 60 సంవత్సరాల కలను సాకారం చేసి ప్రజాసామ్య పై గౌరవం పెంచిన దేవత అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నష్టం పోయిన ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఏర్పాటును చేసిన మానవత వాది అని ఆయన కొనియాడారు.నేడు బీజేపీ తెలంగాణ పై విషం చిమ్ముతుందని అనేక మంది బలిదానాలు, పోరాటాలు, త్యాగాలను అవహేళన చేస్తున్న బిజెపి తెలంగాణలో భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు.

నియోజకవర్గాల పునర్ విభజనపై సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన వాటిపై సమాధానాలు చెప్పలేక మోడీ, అమిత్ షా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణ భారతదేశం పై బిజెపి చూపిస్తున్న సవతి తల్లి ప్రేమపై రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని అన్నారు. మహిళా బిల్లు ముసుగులో బిజెపి కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ చర్చను పక్కత్రోవ పట్టిస్తుందన్నారు. తెలంగాణ గడ్డ పై పుట్టిన బీజేపీ నేతలు నోరు మొదపటం లేదని వారు తెలంగాణ ద్రోహులన్నారు. తెలంగాణలో బిజెపి గద్దెలు కూలుతాయని హెచ్చరించారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎండి ముంతాజ్ అలీ,పేరిక వెంకటేశ్వర్లు,జిల్లాపల్లి పరమేశ్,నోముల జనార్ధన్,కోమటిరెడ్డి అంజి రెడ్డి,చింతమల్ల వెంకటయ్య,వేముల గోపీనాథ్,పగుళ్ళ రాజు,చర్లపల్లి గౌతమ్,మేకల సాగర్ రెడ్డి,అంబల హరీష్,పల్లా రవి తేజ, కాటం వెంకన్న , బోడ అరుణ్,ఇందనూరి శ్రీను,పేరిక అంజయ్య,ఈధ శేఖర్, ఎండీ అజీజ్, ఎండీ ఫిరోజ్,వినీత్, సన్నీ, కౌశిక్,జశ్వంత్, శరత్ తదితరులు పాల్గొన్నారు…..

మరిన్ని వార్తలు