Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : వేబ్రిడ్జ్ మోసంపై అధికారుల ఉక్కుపాదం.. మనసాక్షి కథనానికి స్పందన..!

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం తాళ్ళ మల్కాపురం గ్రామ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వేబ్రిడ్జ్ అక్రమాలపై మన సాక్షి లో ప్రచురితమైన కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు.

Suryapet : వేబ్రిడ్జ్ మోసంపై అధికారుల ఉక్కుపాదం.. మనసాక్షి కథనానికి స్పందన..!

గరిడేపల్లి, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం తాళ్ళ మల్కాపురం గ్రామ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వేబ్రిడ్జ్ అక్రమాలపై మన సాక్షి లో ప్రచురితమైన కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు. రైతు గండు సతీష్‌కు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తేవడమే కాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎండగట్టిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

వెలిదండ గ్రామానికి చెందిన రైతు గండు సతీష్ తాను పండించిన ధాన్యాన్ని విక్రయించే క్రమంలో తాళ్ళ మల్కాపురం వేబ్రిడ్జ్‌పై తూకం వేశారు. అక్కడ వచ్చిన తోకముకు బయట వచ్చిన తూకంకు మధ్య ఉన్న వ్యత్యాసం చూసి ఆయన అవాక్కయ్యారు. శ్రీ వెంకటేశ్వర వేబ్రిడ్జ్ తాళ్ళ మల్కాపురం 4440 కేజీలు, వైష్ణవి మిల్లు మిర్యాలగూడ 4560 కేజీలు, 120 కేజీలు తక్కువ కేవలం ఒకే లోడులో సుమారు 120 కేజీల తక్కువ రావడంపై రైతు ప్రశ్నిస్తే, యాజమాన్యం నుంచి కనీస స్పందన కరువైంది.

పైగా నిర్లక్ష్యపు సమాధానాలతో బాధితుడిని వేధించారు. దాంతో మనసాక్షి, పత్రిక కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు 24 గంటల వ్యవధిలోనే పౌర సరఫరాల శాఖ, తూనికలు మరియు కొలతల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

ఆకస్మిక తనిఖీలు:

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గరిడేపల్లి మండలంలోని అన్ని వేబ్రిడ్జ్‌లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. తూకాల్లో మోసాలకు పాల్పడే నిర్వాహకులపై కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని యోచిస్తున్నారు.
లైసెన్స్ రద్దు డిమాండ్ సదరు వేబ్రిడ్జ్ లైసెన్స్‌ను తక్షణమే రద్దు చేసి, బాధితుడైన రైతుకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రజా పక్షాన మనసాక్షి

రైతుల చెమట చుక్కను దోచుకుంటున్న దళారులు, అక్రమ వేబ్రిడ్జ్ నిర్వాహకుల గుట్టు రట్టు చేయడంలో,, మనసాక్షి ఎప్పుడూ ముందుంటుంది. రైతులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు