Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : రైతుల ఖాతాలలో రెండవ విడత రైతు భరోసా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం..!

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం రెండవ విడత రైతుల ఖాతాలలో నిధులు జమ కానున్నాయి. అందుకుగాను ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభలో రెండవ విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.

Rythu Bharosa : రైతుల ఖాతాలలో రెండవ విడత రైతు భరోసా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం రెండవ విడత రైతుల ఖాతాలలో నిధులు జమ కానున్నాయి. అందుకుగాను ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభలో రెండవ విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.

రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12 వేల రూపాయలను రెండు విడతలుగా అందజేస్తున్న విషయం తెలిసిందే. యాసంగి విడత రైతు భరోసా పథకంలో భాగంగా గత నెల 23వ తేదీన మొదటి విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో జమ చేశారు. సుమారు 74 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున ఎకరానికి 6000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేశారు. మొదటి విడతలో 3590 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేసింది.

కాగా రెండవ విడత డబ్బులను రైతుల ఖాతాలలో ఈనెల 20వ తేదీన రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు.
అందుకుగాను వ్యవసాయ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అదే విధంగా రెండవ విడత 2063 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను 45,11,947 మంది రైతులకు జమ చేయనున్నారు. దాంతో యాసంగి విడత రైతు భరోసా నిధులు 5653 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసినట్లు అవుతుంది. ఇక చివరి విడత ఈనెల చివరిలోగా విడుదల చేయనున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు