Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవిద్యసూర్యాపేట జిల్లా
Suryapet : 30 ఏళ్ల స్నేహం.. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..!
సూర్యాపేటలోని ఆర్.కె.ఎల్.కె డిగ్రీ కళాశాలలో 30 సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేసిన తెలుగు మీడియం విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఏర్పాటు చేసుకున్నారు.

Suryapet : 30 ఏళ్ల స్నేహం.. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేటలోని ఆర్.కె.ఎల్.కె డిగ్రీ కళాశాలలో 30 సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేసిన తెలుగు మీడియం విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా 30 సంవత్సరాల గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు కళాశాలలో గడిపిన ఆనాటి రోజులను తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు.
వివిధ హోదాలో స్థిరపడిన విద్యార్థులు విద్యార్థినిలు కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థినీ విద్యార్థులు కారింగుల శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, అజిత్, గిరి, ఉష, సుష్మ, గురునాథం, శ్రీధర్, నరసింహారావు, శంకర్, రఘు, సుధీర్, రవి, రమేష్, సునీత, శశికళ, విద్య, రజిత, విజయ తదితరులు పాల్గొన్నారు.









