Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుమెదక్

జోగిపేటలో ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు.. పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహ..!

జోగిపేటలో మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

జోగిపేటలో ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు.. పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహ..!

అందోలు, మన సాక్షి :

జోగిపేటలో మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ మహాత్మా బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన మంత్రి, బసవేశ్వరుడు సమాజ సమానత్వానికి, కులమత భేదాలు లేని సమాజ నిర్మాణానికి చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.

బసవేశ్వరుని ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకమని, ఆయన చూపిన దారిలో నడిస్తే సమానత్వ సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బసవేశ్వరుని సందేశాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

మరిన్ని వార్తలు