Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : కోడలిని వేధించిన మామ.. ఆత్మహత్య చేసుకున్న కోడలు..!

కోడల్ని మానసికంగా వేధించి ఆత్మహత్యకు కారణమైన మామను అరెస్ట్ చేసినట్లు నల్గొండ టూ టౌన్ సీఐ రాఘవరావు తెలిపారు.

Nalgonda : కోడలిని వేధించిన మామ.. ఆత్మహత్య చేసుకున్న కోడలు..!

నల్లగొండ, మనసాక్షి :

కోడల్ని మానసికంగా వేధించి ఆత్మహత్యకు కారణమైన మామను అరెస్ట్ చేసినట్లు నల్గొండ టూ టౌన్ సీఐ రాఘవరావు తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ
నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య (20)కు ఐదు నెలల క్రితం పానగల్లుకు చెందిన శివశంకర్‌తో వివాహం జరిగిందని తెలిపారు.

భర్త ఇంట్లో లేని సమయంలో మామ వర్రే లింగయ్య తరచూ కోడలు పై వేధింపులకు పాల్పడ్డారని ప్రతి చిన్న విషయానికీ తప్పుపట్టడం,అవమానించడం, మానసికంగా హింసించడం చేసినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు. మేరకు టూ టౌన్ ఎస్ఐ సైదులు దర్యాప్తు వేగవంతం చేసి చేశారని చెప్పారు, దర్యాప్తులో
“నువ్వు చస్తే నా కొడుకుకు ఇంకా మంచి భార్య వస్తుంది”అంటూ తీవ్రంగా వేధించినట్లు కేసులో వెల్లడి అయ్యిందని
వేధింపులు తట్టుకోలేక ఈనెల18 న ఉదయం పానగల్లు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుందని చెప్పారు.

మృతురాలి తండ్రి చింతల వెంకటయ్య ఫిర్యాదుతో నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందితుడు వర్రే లింగయ్య (45)ను సోమవారం అతని నివాసంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరచేందుకు రిమాండ్‌కు తరలింపు కోడలిపై వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరించారు.

Most Read : 

మరిన్ని వార్తలు