ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23వ తేదీన గుంటూరు జిల్లా లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయవాద గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఆయన మొట్టమొదట 1978లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో మంత్రిగా పనిచేయడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పదకొండవ ముఖ్యమంత్రిగా నెలరోజుల పాటు పనిచేశారు. నాదెండ్ల భాస్కరరావు రాజకీ రాజకీయ చరిత్రలోనే నిలిచిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ హయాంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా ఆయన ఉన్నారు.
అయితే 1984లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన సందర్భంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత బలం నిరూపించుకో లేకపోవడం వల్ల కేవలం ఒక నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఆయన పని చేశారు. అప్పటినుంచి ఆయన తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేతగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి లోక సభ సభ్యుడిగా గెలిచారు. 2019లో కాంగ్రెస్ వీడి భారతీయ జనతా పార్టీలో ఆయన చేరారు.









