Breaking Newsతెలంగాణ
TG News : సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతులు..!
తెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతులు దక్కాయి. పదోన్నతులు పొందిన వారిలో 1995, 1996 బ్యాచ్ లకు చెందిన ఐపీఎస్ అధికారులు ఉన్నారు.

TG News : సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతులు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతులు దక్కాయి. పదోన్నతులు పొందిన వారిలో 1995, 1996 బ్యాచ్ లకు చెందిన ఐపీఎస్ అధికారులు ఉన్నారు. పదోన్నతులు పొందిన వారిలో 1995 బ్యాచ్ కి చెందిన వీవీ శ్రీనివాసరావు, స్వాతి లక్రా, మహేష్ భగవత్, 1996 బ్యాచ్ కి చెందిన డాక్టర్ అనిల్ కుమార్, విసి సజ్జనార్, చారు సిన్హా ఉన్నారు. వీరంతా అడిషనల్ డీజీ నుంచి డీజీలుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.









