Nalgonda : బైక్, కారు ఢీకొని ముగ్గురు మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..!
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో బుధవారం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Nalgonda : బైక్, కారు ఢీకొని ముగ్గురు మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..!
గుర్రంపోడు, మన సాక్షి :
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో బుధవారం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం మండలంలోని శాంతినగర్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, కనగల్ మండల కేంద్రానికి చెందిన నర్సింగ్ మధుబాబు (38), నర్సింగ్ ధనంజయ (55)లు మల్లెపల్లి మండలం గుమ్మడవెల్లి మిల్లులో వడ్లు అమ్ముకొని, ఆ డబ్బులు తీసుకుని బైక్పై తిరిగి వస్తున్నారు.
ఇదే సమయంలో గుర్రంపోడ్ మండలం శాఖాజీపురం గ్రామానికి చెందిన మారెడ్డి బాల్ రెడ్డి (65), తన భార్య హలియమ్మతో కలిసి నల్గొండలోని ఒక ఫంక్షన్కు వెళ్లి కారులో తిరిగి వస్తున్నారు.శాంతినగర్ సమీపంలో ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న మధుబాబు, ధనంజయ అక్కడికక్కడే మృతి చెందారు.
కారులో ఉన్న బాల్ రెడ్డి కూడా తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు.కారులో ఉన్న హలియమ్మ, వెంకమ్మ, మంజులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ జైపాల్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.
ప్రమాద వార్త తెలిసిన వెంటనే నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్, దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్ రావు, కొండమల్లేపల్లి సీఐ నవీన్ కుమార్లు సంఘటనా స్థలాన్ని సందర్శించి, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు









