Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

TG News : రైతులకు గుడ్ న్యూస్.. వారికి ఎకరానికి రూ. 50వేల రాయితీ..! 

రైతులు తక్కువ నీటి వసతితో అధిక దిగుబడిచే పంటలను ఎంచుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు.

TG News : రైతులకు గుడ్ న్యూస్.. వారికి ఎకరానికి రూ. 50వేల రాయితీ..! 

సూర్యాపేట, మనసాక్షి:

రైతులు తక్కువ నీటి వసతితో అధిక దిగుబడిచే పంటలను ఎంచుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక స్టార్ బాంకెట్ హాల్లో రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవడం ఎంతో ఉత్తమం అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న కూలీల కొరత, నేటి లభ్యత కారణంగా రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ప్రత్యేక సబ్సిడీలు అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించే రైతుల కోసం ఎన్ ఎం ఈ ఓ – ఓ పి పథకం కింద మొక్కలు, ఎరువులు, అంతర పంట సాగు బిందు సేద్య పరికరాల ఏర్పాటు కోసం మొదటి నాలుగు సంవత్సరాల కాలంలో 50 వేల 918 రూపాయలు రాయితీ కింద ఇస్తుందన్నారు.

మొక్కల కోసం రైతు తన వాటా కింద ఒక్కో మొక్కకు 20 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుందని బిందు సేద్య పరికరాల ఏర్పాటు కోసం మార్గదర్శకాలను అనుసరించి రైతు తన వాటా చెల్లించాలని అన్నారు. జిల్లాకు కేటాయించిన ఆయిల్ పంప్ కంపెనీలు నర్సరీ పెంచి రైతులకు మొక్కలు సరఫరా చేసి రైతులకు తగు సాంకేతిక సలహాలు ఇవ్వడంతో పాటు జిల్లా పరిధిలో ఆయిల్ ఫామ్ మిల్లును ఏర్పాటు చేసి ప్రతినెల ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతుల దగ్గర నుంచి ఆయిల్ ఫామ్ గెలలు కొనుగోలు చేసి 14 రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు.

తుంగతుర్తి లోని తన స్వంత వ్యవసాయ క్షేత్రంలో 25 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృశ్య ఆయిల్ఫామ్ సాగును ఎంచుకొని ఆర్థికంగా బలపడాలని కోరారు. త్వరలో 15 ఎకరాలలో మామిడి మార్కెట్ ను ఏర్పాటు చేసుకోబోతున్నామని, కోటపహాడ్ గ్రామానికి వెళ్ళినప్పుడు రైతుల కోరిక మేరకు మార్క్ ఫెడ్ అధికారులతో మాట్లాడి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

2012 నుండి ఈ రోజు వరకు హైదరాబాద్ హయత్ నగర్ లో మా అమ్మ పేరు మీద డైరీ ఫామ్ నడుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోజిల్లా వ్యవసాయ అధికారి జి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య ఆత్మ చైర్మన్ కాసం లింగా రెడ్డి, వైస్ చైర్మన్ పంతంగి మల్సూర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి, తూముల సురేష్ రావు, ధారవత్ వీరన్న నాయక్, ఆయిల్ ఫెడ్ జిల్లా ఇంచార్జి అలీం, కెవికే సీనియర్ హెడ్ డాక్టర్ నరేష్, కెవికే సీనియర్ సైటిష్ట్ నరేష్, ప్రాంతీయ ఉద్యాన అధికారిణి కట్ట స్వాతి,ఇఫ్కో మేనేజర్ వెంకటేష్, జేకే పేపర్స్ మేనేజర్ రామకృష్ణ, హెచ్ ఈ ఓ యానాల సుధాకర్ రెడ్డి మండల వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు