Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

చిత్తలూరులో చెరకు పంట ధ్వంసం..!

చిత్తలూరులో చెరకు పంట ధ్వంసం..!

నిందితులపై చర్యలు తీసుకోవాలని రైతు ఫిర్యాదు.

శాలిగౌరారం, మన సాక్షి :

శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో రైతు బొడ్డు చిన లింగయ్యకు చెందిన 30 గుంటల చెరకు పంటను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నష్టపరిహారం ఇప్పించి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత రైతు శాలిగౌరారం ఎస్‌ఐకు ఫిర్యాదు చేశాడు.

చిత్తలూరు గ్రామానికి చెందిన రైతు బొడ్డు చిన లింగయ్య పది రోజుల క్రితం తన స్వంత 30 గుంటల భూమిలో 9 వేల చెరకు మొక్కలు నాటి సాగు చేస్తున్నారు. బోరు, కరెంటు మోటారు ఏర్పాటు చేసుకుని పంటను సంరక్షిస్తున్నట్లు తెలిపారు.
అయితే శుక్రవారం రాత్రి బొడ్డు కండెయ్య, కొండయ్య, బొడ్డు పెద్ద లింగయ్య, బొడ్డు లక్ష్మమ్మ, బొడ్డు ప్రమీల కుటుంబీకులు కలిసి చేనులోని మొక్కలను పీకి ధ్వంసం చేశారని బాధితుడు ఆరోపించారు. కుటుంబీకుల నుంచి తనకు ప్రాణ భయం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ధ్వంసమైన పంటకు నష్టపరిహారం ఇప్పించడంతో పాటు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు