Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన బిజెపి నాయకులు..!

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం ఆయన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలోని ఆమనగల్ , లక్ష్మీదేవి గూడెం గ్రామాలలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో ధాన్యం రాశులను పరిశీలించి రైతులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Miryalaguda : ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన బిజెపి నాయకులు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం ఆయన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని
వేములపల్లి మండలంలోని ఆమనగల్ , లక్ష్మీదేవి గూడెం గ్రామాలలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో ధాన్యం రాశులను పరిశీలించి రైతులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల మార్చి 24 న వచ్చిన వడ్లు ఇప్పటి వరకు కొనుగోలు జరగకపోవడం దారుణమని, దాదాపు 50 రోజుల నుండి కొనుగోలు కేంద్రాలలో వడ్లు నిలిచి ఉండడం తో కాంటాకు తూకం కూడా వడ్లు రావడం లేవని వడ్లు పూర్తిగా పేలాల ఎండిపోతున్నాయని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఐకెపి కేంద్రాలను జిల్లా మంత్రులు గాని స్థానిక ఎమ్మెల్యేగాని ,

ప్రజా ప్రతినిధులు గాని ఏ యొక్క అధికారి కూడా సందర్శించకపోవడం దారుణమని, లారీల కొరత తీవ్రంగా ఉందని, బస్తాలు సకాలంలో అందకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రైస్ మిల్లల వద్ద రోజుల కొద్దీ దిగుమతి లేక రైతులు ఎదురు చూస్తున్నారని, లారీలు అందుబాటులో లేక రైతులు పడిగాపులు కాస్తున్నారని, రైస్ మిల్లర్ల ఇష్టారాజ్యం అయిందని అన్నారు.

ఐకేపీ కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవు అని మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు గత వారం రోజుల్లో వర్షం పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించినప్పటికీ కొనుగోలు ఇంకా నెమ్మదిగా జరగడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని, ఇప్పటికైనా కొనుగోలు పనులు వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి ముందు చూపు లేదని కేంద్ర ప్రభుత్వం నుండి క్వింటాకు మద్దతు ధర 2389 గా, హమాలీ చార్జీలు, బస్తాలు, పూరి కోస, రైస్ మిల్లర్లకు కమిషన్, అన్ని రకాలుగా చెల్లిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేకపోవడంతో ధాన్యం కొనుగోలులో విఫలమైందని అన్నారు. గత 50 రోజులుగా ఐకెపి కేంద్రాలలో దాన్యం ఇంకా నిలిచి ఉండడం దారుణమని ఐకెపి కొనుగోలు కేంద్రాలలో లారీల కొరత తీవ్రంగా ఉందని, రైస్ మిల్లర్ల దోపిడి తో రైతు క్వింటాకు 5 కేజీల నుండి 7 కేజీల వరకు నష్టపోతున్నారని, ప్రభుత్వం రైస్ మిల్లర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి కొనుగోలు పనులు వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కోశాధికారి కన్మంత్ రెడ్డి అశోక్ రెడ్డి, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకట్ రెడ్డి, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పెదమాం భరత్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జవ్వాజి సత్యనారాయణ, జిల్లా నాయకులు జానకి రామ్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు పెదమాం ప్రసాద్, మండలకార్యదర్శి చింతకాయల సైదులు, బిజెపి నాయకులు మనపూరి పురుషోత్తమ్, శివ, గణేష్, సైదులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు