Breaking Newsక్రైంజిల్లా వార్తలునారాయణపేట జిల్లారాజకీయం
Breaking : పేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి హఠాన్మరణం..!
నారాయణపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శీల చంద్ర శేఖర్ రెడ్డి అనారోగ్యంతో శుక్రవారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందారు.

Breaking : పేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి హఠాన్మరణం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శీల చంద్ర శేఖర్ రెడ్డి అనారోగ్యంతో శుక్రవారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందారు. చిన్న నాటి నుంచి చంద్ర శేఖర్ రెడ్డి కరుడుగట్టిన ఆర్ ఎస్ ఎస్, బిజెపి కార్యకర్తగా ఉండి 2009 లో తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి
టి ఆర్ ఎస్ లో చేరి మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు నుంచి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు.
అప్పుడు కాంగ్రెస్,బిజెపి లకు సంపూర్ణ మెజారిటీ లేక పోవడంతో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.మృదు స్వభా వంతోప్రజా సమస్యలు తీర్చుకుంటూ అందరి మనసులు గెలుచుకున్నారు. అలాంటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శీల చంద్రశేఖర్ రెడ్డి హఠాన్మరణం చెంద డంతో దిగ్బ్రాంతికి గుర య్యారు. బిజెపి, బి ఆర్ ఎస్,కాంగ్రెస్ నాయకులు, స్నేహా మిత్ర మండలి సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.









