Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsకరీంనగర్జిల్లా వార్తలురాజకీయం

Karimnagar : ధాన్యం కొనుగోలులో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..!

ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎన్ రామచందర్ రావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా బిజెపి శ్రేణుల ప్రశిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు హాజరైన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పంట కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై మండిపడ్డారు.

Karimnagar : ధాన్యం కొనుగోలులో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..!

ధాన్యం కొనుగోళ్లపై మంత్రులకే స్పష్టత లేదు.. గందరగోళ లెక్కలు చెప్తున్నారు..

ప్రతిపైసా కేంద్రమే ఇస్తున్నా… కొనుగోళ్లలో మీకున్న ఇబ్బంది ఏంటి..?

ప్రతి గింజను కొనుగోలు చేయాలి..

అకాల వర్షాలతో నష్టపోయిన పంట ఏ కండిషన్లో ఉన్న కొనుగోలు చేయాలి..

మంత్రి పొన్నం ప్రభాకర్ భవిష్యవాణి చెప్తున్నారా…?

ఎరువుల కొత్త సృష్టిస్తే ఖబర్దార్

మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

కరీంనగర్, మనసాక్షి :

ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎన్ రామచందర్ రావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా బిజెపి శ్రేణుల ప్రశిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు హాజరైన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పంట కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై మండిపడ్డారు.

ధాన్యం కొనుగోలు తో పాటు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలకు పైసలన్నీ కేంద్రమే ఇస్తున్నప్పటికీ, వడ్లను సరిగా కొనుగోలు చేయలేని దౌర్భాగ్యస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. స్వయంగా తానే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న బాధలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకొచ్చేందుకే ‘‘రైతు గోస బీజేపీ భరోసా’’ పేరుతో యాత్ర నిర్వహించడం జరిగిందన్నారు.

అయినా కూడా ఇంకా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండడంతో అకాల వర్షానికి రైతులు తీవ్రంగా పంట నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం వద్ద పంట సేకరణ విషయంలో నిర్దిష్ట గణాంకాలు లేవని, మంత్రులే తల తోక లేని సమాధానాలు చెబుతున్నారని, వారి వద్ద ఉన్న లెక్కలన్నీ గందరగోళంగా ఉన్నాయన్నారు. పంట కొనుగోలు చేయకుండా రైతులను గోస పెట్టడం సరికాదన్నారు.

అసలు ధాన్యం కొనుగోలు పైసలన్నీ కేంద్రానివా? రాష్ట్రానివా? సమాధానం చెప్పాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుతిలీతాడు మొదలు రవాణా ఖర్చులన్నీ కేంద్రమే ఇస్తోందన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తి మాత్రమే చేస్తుందని, మధ్యవర్తిత్వం చేసినందుకు కేంద్రం రాష్ట్రానికి కమీషన్ కూడా ఇస్తోందన్నారు.

చేతకాని ప్రభుత్వంతో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, కొనుగోళ్లలో విఫలమైందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలలో యుద్ద ప్రాతిపదికన మిగిలి ఉన్న ధాన్యంను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కొనుగోలను వదిలేసి ఎరువుల గురించి ముందే మాట్లాడుతూ భవిష్యవాణి చెప్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. కొనుగోళ్లలో వైఫల్యం చెందిన రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రేపు రాబోయే కాలానికి ఎరువుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేయాలని ఆలోచనతో అనవసర వ్యాఖ్యలు చేస్తుందని ఆయన మండిపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు యూరియా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం యూరియా కొడత లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. రైతులకు యూరియాను సక్రమంగా సరఫరా చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై నెట్టాలని చూస్తే ఖబర్దార్ అని ఆయన హెచ్చరించారు.

మీడియా సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కోలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, బోడిగే శోభ, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు