Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలునిజామాబాద్

ఆలూర్ డిప్యూటీ తహసీల్దార్‌గా ప్రవీణ్ కుమార్ బాధ్యతల స్వీకారం..!

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల నూతన డిప్యూటీ తహసీల్దార్‌గా ప్రవీణ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

ఆలూర్ డిప్యూటీ తహసీల్దార్‌గా ప్రవీణ్ కుమార్ బాధ్యతల స్వీకారం..!

ఆర్మూర్, మన సాక్షి :

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల నూతన డిప్యూటీ తహసీల్దార్‌గా ప్రవీణ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు దర్పల్లి మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై ఆలూర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆలూర్ తహసీల్దార్ రమేష్, ఆర్‌ఐ అరవింద్ ఆధ్వర్యంలో ప్రవీణ్ కుమార్‌కు స్వాగతం పలికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని, రెవెన్యూ సేవలను పారదర్శకంగా అందించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, ఆర్ ఐ అరవింద్, రెవెన్యూ శాఖ అధికారులు శ్రీజ, శ్రీవాణి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు