రావులపెంట పంచాయతీ కార్యదర్శిగా బంటు మహేష్ బాధ్యతలు..!
వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా బంటు మహేష్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.

రావులపెంట పంచాయతీ కార్యదర్శిగా బంటు మహేష్ బాధ్యతలు..!
వేములపల్లి, మన సాక్షి:
వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా బంటు మహేష్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పని చేసిన రామ్ రెడ్డి బదిలీ పై వెళ్లగా.. ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తానని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానన్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం కార్యదర్శి మహేష్ కు గ్రామ సర్పంచ్ సందరబోయిన చంద్రయ్య, మాజీ సర్పంచ్ దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి, పాలకవర్గం సభ్యులు సన్మానించి స్వాగతం పలికారు.
రామ్ రెడ్డి బదిలీ
మండలంలోని రావులపెంట గ్రామ పంచాయతీ కార్యదర్శి కట్కూరి రామ్ రెడ్డి బదిలీ అయ్యారు. 2019లో కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రామ్ రెడ్డి…సుమారు 7 సంవత్సరాల పాటు ప్రజలకు విశిష్ట సేవలందించారు.గ్రామంలోని ప్రజలకు తాగునీటి సౌకర్యం, మౌలిక వసతుల కృషి చేసి..
పారిశుద్ధ్య నిర్మూలనకు పరిష్కారం చూపి తమదైన ముద్ర వేసుకున్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేలా కృషి చేసిన ఆయన..ఇటీవల బదిలీ పై కుక్కడం వెళ్లారు.ఈ సందర్భంగా ఆయనకు గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, సిబ్బంది వీడ్కోలు పలికారు.









