TG News : తెలంగాణలో కొత్త పెన్షన్లు, పరిషత్ ఎన్నికలపై భట్టి విక్రమార్క లేటెస్ట్ అప్డేట్..!
తెలంగాణలో కొత్త పెన్షన్లు ఇస్తామని, ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా పథకం అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

TG News : తెలంగాణలో కొత్త పెన్షన్లు, పరిషత్ ఎన్నికలపై భట్టి విక్రమార్క లేటెస్ట్ అప్డేట్..!
మనసాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కొత్త పెన్షన్లు ఇస్తామని, ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా పథకం అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంగళవారం ఖమ్మం జిల్లాలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. అసెంబ్లీ, ఎంపీ, మున్సిపల్, గ్రామపంచాయతీ ఎన్నికల్లో మా సత్తా చూపించమన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ప్రత్యర్ధులే లేరని ఆయన పేర్కొన్నారు.
మాకు పని ముఖ్యం కానీ ప్రచారం కాదని పనిచేసే పార్టీలకు ప్రచారం అవసరం లేదన్నారు. ఈ నెలలోనే ఎస్ ఐ ఆర్ (SIR) ప్రక్రియ జరగబోతుందని, ఈ అంశంపై మీడియా దృష్టి పెట్టాలన్నారు. ఓట్లు గల్లంత కాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. బిజెపి రైతు వ్యతిరేక పార్టీ అని ఆయన విమర్శించారు. మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కొత్త పెన్షన్లతో పాటు జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా పరిషత్ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇప్పటికే చాలామంది నేతలు టికెట్లు కన్ఫర్మ్ చేసుకోవడంతో పాటు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.









